TRS: టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు

  • ఆర్యవైశ్యుల సభకు హాజరైన నేత
  • విరాళాలు సేకరణ
  • ప్రతిపక్ష నేతల ఫిర్యాదు
టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబరు 30న నిర్వహించిన ఆర్యవైశ్యుల సభకు హాజరైన హరీశ్ రావు ఎన్నికల విరాళాలు సేకరించినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కుల, మత కార్యక్రమాలకు హాజరై ఓ వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతలు అందించిన ఫొటోలు, సీడీలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని రజత్ కుమార్ ఆదేశించారు.  ఈ మేరకు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు హరీశ్ రావుపై 125 ఆర్‌పీ, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఓసారి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన హరీశ్‌రావుపై ఇప్పుడు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు కావడం గమనార్హం.
TRS
Harish Rao
EC
Siddipet District
Police case
Telangana

More Telugu News