తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టాలి: స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
- కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా రుణం తీర్చుకుందాం
- ఓట్లు చీలకూడదనే టీడీపీతో మా పొత్తు
- పంచుతున్న డబ్బు తీసుకోండి కానీ, ఓటు మాకే వేయండి
కాంగ్రెెస్-టీడీపీ కలయికపై వస్తున్న విమర్శలను ఈ సందర్భంగా ఆమె ఖండించారు. ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీతో తాము పొత్తు పెట్టుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పంచుతున్న డబ్బు తీసుకోండి కానీ, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని ప్రజలకు సూచించారు.