jana sena: ‘జనసేన’లో చేరనున్న టీడీపీ నాయకుడు రావెల?

  • ప్రత్తిపాడు నాయకుడు రావెల కిషోర్ బాబు అసంతృప్తి
  • డిసెంబర్ 1న ‘జనసేన’లోకి?
  • పవన్ కల్యాణ్ ని ఇప్పటికే రెండు సార్లు కలిసిన రావెల
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. డిసెంబర్ 1న జనసేన’లో ఆయన చేరనున్నట్టు రావెల వర్గీయుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న రావెల, కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని ఆయన వీడనున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఇప్పటికే రెండు సార్లు ఆయన కలిశారట. పార్టీ మారే విషయమై రావెల తన అనుచరులతో చర్చించారని సంబంధిత వర్గాల సమాచారం. 
jana sena
Telugudesam
Ravela Kishore Babu
prathipadu

More Telugu News