Chandrababu: ప్రజా కూటమి విజయవంతం కావాలని 13 సీట్లే తీసుకున్నాం: సీఎం చంద్రబాబు

  • కూటమి విజయం సాధిస్తే కాంగ్రెస్ వ్యక్తే ముఖ్యమంత్రి
  • నేనెందుకు రిమోట్ కంట్రోల్ చేస్తాను
  • తెలంగాణ అభివృద్ధి బీజేపీ వ్యతిరేక పార్టీలతోనే సాధ్యం
ప్రజా కూటమి విజయవంతం కావాలన్న ఉద్దేశంతోనే తాము 13 సీట్లే తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నిజాంపేటలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని, తానెందుకు రిమోట్ కంట్రోల్ చేస్తానని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి బీజేపీ వ్యతిరేక పార్టీలతోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ కు పరిపక్వత ఉందట, తనకు లేదని మోదీ అనడం వెనుక లాలూచీ రాజకీయాలు ఉన్నాయని విమర్శించారు. పెద్ద మోదీ, చిన్న మోదీ (కేసీఆర్) లిద్దరూ కలిసి డ్రామాలాడుతున్నారని, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయాలని చూస్తే వీళ్లు కేడీలుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.
Chandrababu
modi
Telugudesam
bjp
nizampet

More Telugu News