చారిత్రక చిహ్నంగా రద్దయిన రూ.500 నోట్లు... ఆన్లైన్లో లావాదేవీలు
- నాణేలు సేకరణ హాబీగా ఉన్న వారు కొంటున్నట్లు సమాచారం
- అమెరికాకు చెందిన వ్యక్తి అమ్ముతున్నట్లు గుర్తింపు
- ఆన్లైన్ విక్రయాలపై కన్నేసిన ముంబయి పోలీసులు
వీరి నుంచి రూ.500 నోట్లకు డిమాండ్ ఉండడంతో ఆన్లైన్లో గుట్టుచప్పుడు కాకుండా లావాదేవీలు నడుస్తున్నాయని పోలీసులకు ఉప్పందింది. దీంతో ముంబయి పోలీసులు నిఘా పెట్టారు. ఆమెరికాకు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి భారతీయులు ఈ రూ.500 నోట్లను ఎక్కువగా కొంటున్నారని తెలిసింది. ఇందుకోసం ఒక్కో నోటుకు ఆరు డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.423 చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఇతని సైట్లో మొత్తం 24 నోట్లు అందుబాటులో ఉండగా అందులో 15 ఇప్పటికే అమ్ముడుపోయినట్లు గుర్తించారు. కొన్ని చోట్ల రూ.500 నోటును 130 డార్లకు కూడా కొంటున్నారట. అంటే దాదాపు రూ.9 వేలు పైమాట. అబ్బో...ఇదేదో విశేషమే అనుకుంటున్నారు కొందరు.