Anantapur District: అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన వైసీపీ నేత గోవిందరెడ్డి!

  • కదిరిదేవరపల్లికి బైక్ పై వెళుతుండగా ఘటన
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నేత
  • కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కంబదూరు మండలం కదిరిదేవరపల్లికి చెందిన వైసీపీ నాయకుడు గోవింద రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కదిరిదేవరపల్లికి గోవింద రెడ్డి బైక్ పై బయలుదేరారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపానికి చేరుకోగానే ముందు ఆగిఉన్న టిప్పర్  లారీని ఆయన బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

రక్తపు మడుగులో పడిపోయిన గోవిందరెడ్డిని గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, గోవింద రెడ్డి మృతిపై వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, స్వస్థలం కదిరిదేవర పల్లిలో నేడు గోవిందరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Anantapur District
Road Accident
YSRCP
LEADER
GOVINDA REDDY
Police

More Telugu News