2.0: అన్ని బాక్సాఫీస్ రికార్డులకూ 'RIP': రమేష్ బాలా

  • ఈ ఉదయం విడుదలైన '2.ఓ'
  • అన్ని రికార్డులూ తిరగరాయడం ఖాయం
  • ట్విట్టర్ లో సినీ విమర్శకుడు రమేష్ బాలా 
రజనీకాంత్ నటించిన తాజా చిత్రం '2.ఓ' ఇప్పటివరకూ ఉన్న అన్ని భారత చలనచిత్ర రికార్డులనూ తిరగరాస్తుందని ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు రమేష్ బాలా వ్యాఖ్యానించాడు. "ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్‌ రికార్డులన్నింటికి రిప్‌. శంకర్‌ మరోసారి తను విజన్‌ ఉన్న మాస్టర్‌ డైరెక్టర్‌ అని ప్రూవ్‌ చేసుకున్నాడు" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు. రజనీ, అక్షయ్ ల నటను పొగడ్తలతో ముంచెత్తుతూ, ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టిలు తమ పనితనంతో అద్భుతం చేశారని, శంకర్ భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించినట్టేనని అన్నాడు.



2.0
Ramesh Bala
RIP
Records

More Telugu News