సిద్ధూకి బాసటగా పాక్ ప్రధాని.. పాక్‌లో పోటీ చేస్తే గెలుపు అతడిదేనన్న ఇమ్రాన్ ఖాన్
- కర్తార్‌పూర్ కారిడార్‌కు ఇమ్రాన్ శంకుస్థాపన
- గొడవలకు కారణం కశ్మీరే
- దానిని పరిష్కరించుకుంటే అద్భుతాలు
ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాల కోసమే అతడు మాట్లాడాడని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య గొడవలకు కారణమైన కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుంటే రెండు దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జర్మన్, ఫ్రాన్స్ దేశాల్లా మనం ఉండలేమా? అని ప్రశ్నించారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన సిద్ధుకు పాకిస్థాన్‌లో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉందని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసినా ఘన విజయం సాధిస్తారని నవ్వుతూ పేర్కొన్నారు.