చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టిన తుమ్మల నాగేశ్వరరావు
- తెలంగాణపై చంద్రబాబు కుట్ర పన్నారు
- పోలవరం పరిధిలో లేని గ్రామాలను కూడా లాక్కున్నారు
- కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలకు రాహుల్ వద్ద సమాధానం ఉందా?
తెలంగాణపై చంద్రబాబు కుట్ర పన్నారని... పోలవరం పరిధిలో లేని గ్రామాలను కూడా ఆయన లాక్కున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుపై కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలకు రాహుల్ వద్ద సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ తో జత కట్టారని... రాజకీయ మనుగడ కోసమే పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.