ramgopal varma: ఓ పేద కుర్రాడి ప్రేమకథే 'భైరవగీత': రామ్ గోపాల్ వర్మ

  • ప్రేమ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది
  • పాత్రలు మాత్రమే తెరపై కనిపిస్తాయి 
  • అందుకే కొత్తవాళ్లను తీసుకున్నాము  
రామ్ గోపాల్ వర్మ తన సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుంచి అది థియేటర్లలోకి వచ్చేంత వరకూ ఆ సినిమాను గురించే అంతా మాట్లాడుకునేలా చేస్తారు. అంతగా ఆయన తన సినిమా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సారి ఆయన దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఒక వైవిధ్యభరితమైన సినిమా చేశారు .. దాని పేరే 'భైరవగీత'. సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ .. " ఒక డబ్బున్న అమ్మాయికి .. ఒక పేద కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథే 'భైరవగీత'. ఆ ఇద్దరి ప్రేమ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ సినిమా కథను సిద్ధార్థ చెప్పినప్పుడు నాకు ఎంత కొత్తగా అనిపించిందో, సినిమా చూస్తున్నప్పుడు మీకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. కథ సహజత్వానికి దగ్గరగా ఉండాలనీ, పాత్రలు మాత్రమే తెరపై కనిపించాలని కొత్త నటీనటులను తీసుకున్నాము" అని చెప్పుకొచ్చారు.     
ramgopal varma

More Telugu News