nara brahmani: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద నారా బ్రాహ్మణి, ఉపాసనల సందడి!

  • మూడు రోజుల పాటు ఈజిప్టు లో ఎంజాయ్ చేసిన బ్రాహ్మణి, ఉపాసన
  • ట్విట్టర్ ద్వారా తెలిపిన ఉపాసన
  • చరిత్ర గురించి ఎంతో తెలుసుకున్నామన్న చెర్రీ సతీమణి
ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, యంగ్ హీరో చరణ్ భార్య ఉపాసనలు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి ఈజిప్ట్ లో సందడి చేశారు. పిరమిడ్లతో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. గురువారం, శుక్రవారం, శనివారాలలో వారు ఈజిప్ట్ లో ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మూడు రోజుల పాటు ఈజిప్ట్ లో ఉన్నామని... మరిచిపోలేని ట్రిప్ అని ఆమె ట్వీట్ చేశారు. చరిత్రకు సంబంధించి ఎంతో నేర్చుకున్నామని, చర్చించామని తెలిపారు. 
nara brahmani
upasana
egypt

More Telugu News