Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివాహితతో డీఎస్పీ రాసలీలలు.. బయటపెట్టిన భర్త

  • ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
  • డీఎస్పీ మాటలు నమ్మి హైదరాబాద్ నుంచి మకాం మార్చిన కుటుంబం
  • పోలీసులను చూసి పరారైన డీఎస్పీ
తన భార్యతో డీఎస్పీ నడుపుతున్న వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేశాడో భర్త. అయితే, తనను పట్టుకునేందుకు పోలీసులతో వస్తున్న విషయాన్ని పసిగట్టిన డీఎస్పీ వారి కళ్లుగప్పి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బెటాలియన్‌కు చెందిన డీఎస్పీ గతంలో హైదరాబాద్‌లో ఉండేవాడు. ఈ క్రమంలో ఇంటిపక్కన ఉన్న కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. టీటీడీలోని అటవీశాఖలో ఉద్యోగం ఉందని, తిరుపతి వస్తే ఇప్పిస్తానని ఈ సందర్బంగా ఆ కుటుంబ యజమానిని నమ్మబలికాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన దంపతులు ఆరు నెలల క్రితం హైదరాబాద్ నుంచి తిరుచానూరు షిఫ్టయ్యారు.

బాధిత వ్యక్తి కుటుంబం తిరుచానూరు వచ్చిన తర్వాత అతడి భార్యతో డీఎస్పీ సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. అయితే, ఆరు నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో బాధిత వ్యక్తి తిరిగి హైదరాబాద్ చేరుకుని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. కుటుంబం తిరుచానూరులోనే ఉండడంతో వారం పదిరోజులకోసారి వెళ్లి వచ్చేవాడు. ఇది గమనించిన డీఎస్పీ భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు.

విషయం తెలిసిన భర్త పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఇలా కాదని ఆదివారం పకడ్బందీగా ప్లాన్ చేశాడు. పోలీసులకు సమాచారం అందించి, కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ తన భార్య, డీఎస్పీ సన్నిహితంగా ఉండగా చూశారు. అయితే, పట్టుకునేలోపే డీఎస్పీ పరుగులు తీశాడు. వివాహితను అరెస్ట్ చేసిన పోలీసులు డీఎస్పీ కోసం గాలిస్తున్నారు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
DSP
Hyderabad
Tirupati
Police
Woman
Tiruchanuru

More Telugu News