హిందూ దేవతలను అక్బరుద్దీన్ అవమానించినా.. కేసీఆర్ ఏం చేయలేకపోయారు: అమిత్ షా
- విమోచన దినాన్ని కూడా అధికారికంగా నిర్వహించలేదు
- ఎంఐఎంను చూసి కేసీఆర్ భయపడుతున్నారు
- బీజేపీకి అధికారం ఇస్తే.. అధికారం అంటే ఏమిటో చేసి చూపిస్తాం
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఏమీ లేదని... ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని అమిత్ షా అన్నారు. గతంలో నిర్మల్ లో ఎన్నో పరిశ్రమలు ఉండేవని... ఇప్పుడు అన్నీ మూత పడ్డాయని చెప్పారు. ఈ పరిశ్రమలు మూతపడటానికి కారణం ఎవరో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమైనవని... రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయని చెప్పారు.