Ambarish: సినీ నటి సుమలత భర్త అంబరీష్ కన్నుమూత

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్
  • వేధిస్తున్న కిడ్నీ, శ్వాసకోస సమస్యలు
  • శోక సంద్రంలో కన్నడ చిత్ర పరిశ్రమ
ప్రముఖ సినీ నటి సుమలత భర్త, కన్నడ నటుడు అంబరీష్ (66) మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

29 మే 1952న అప్పటి మైసూర్ రాష్ట్రం మాండ్య జిల్లాలోని దొడ్డరసినకెరెలో అంబరీష్ జన్మించారు. అసలు పేరు గౌడా అమర్‌నాథ్. 1972లో ప్రఖ్యాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ రూపొందించిన ‘నాగరాహవు’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. కన్నడ రెబల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన 200పై చిలుకు చిత్రాల్లో నటించారు.

1991లో సినీ నటి సుమలతను వివాహం చేసుకున్నారు. 2013లో కాంగ్రెస్ తరపున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అంబరీష్ మృతితో కన్నడ చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నివాళులర్పించేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
Ambarish
Sumalatha
Kannada
Congress
Karnataka
Bangaluru

More Telugu News