Chandrababu: చంద్రబాబును సీఎం చేసింది మేమే.. వైసీపీ వస్తే అడ్డంగా దోచేస్తుంది: పవన్

  • గిరిజన హక్కుల కోసం జనసేన పోరాడుతుంది
  • టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు ప్రజల కోసం పని చేస్తే జనసేన రావాల్సిన అవసరం లేదు
  • గిరిజన యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు రావాలి
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన ఘనత జనసేనదే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు రాజమండ్రి నుంచి రంపచోడవరంకు ఆర్టీసీ బస్సులో ఆయన వెళ్లారు. మార్గమధ్యంలో గిరిజనులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, గిరిజన హక్కుల కోసం తాము పోరాడుతామని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు రావాలని అన్నారు.

 జనసేన ద్వారానే గిరిజనులను న్యాయం జరుగుతుందని చెప్పారు. అవినీతి రహిత పాలన ఉంటే... ఇంతమంది అడవుల్లోకి వెళ్లి, పోరాటాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు త్రికరణశుద్ధితో ప్రజల కోసం పని చేస్తే జనసేన రావాల్సిన అవసరమే లేదని చెప్పారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తుందని అన్నారు.
Chandrababu
YSRCP
Pawan Kalyan
janasena

More Telugu News