saidharam tej: మెగా హీరోకి పోటీ తప్పడం లేదు

  • తేజు హీరోగా 'చిత్రలహరి'
  • ఏప్రిల్ 19న రిలీజ్ చేసే ఆలోచన 
  • అదే రోజుని ఫిక్స్ చేసుకున్న 'జెర్సీ'
కొంతకాలంగా సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో సతమతమైపోతున్నాడు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన కిషోర్ తిరుమల కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'చిత్రలహరి' టైటిల్ తో ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనుంది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో తేజు వున్నాడు.

ఏప్రిల్ 5వ తేదీన మహేశ్ బాబు 'మహర్షి' విడుదల వుండటంతో, రెండు వారాల గ్యాప్ చూసుకుని ఏప్రిల్ 19వ తేదీన 'చిత్రలహరి'ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సోలో రిలీజ్ కనుక తమ సినిమా వసూళ్ల విషయంలో టెన్షన్ పడవలసిన అవసరం లేదని అనుకున్నారు. కానీ తాజాగా నాని 'జెర్సీ' సినిమాను ఏప్రిల్ 19వ తేదీనే విడుదల చేయనున్నట్టు ప్రకటన వచ్చింది. దాంతో 'చిత్రలహరి' దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంటారో .. మార్చుకుంటారో చూడాలి. 
saidharam tej
kalyani

More Telugu News