vijay devarakonda: మా సినిమాను నయనతార చాలా భయపెట్టేసింది: 'టాక్సీవాలా' దర్శకుడు

  • 'టాక్సీవాలా' షూటింగు మధ్యలో వుంది 
  • 'డోరా' రిలీజ్ రోజున థియేటర్ కి పరిగెత్తాను 
  • హమ్మయ్య అనుకుని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాము  
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన 'టాక్సీవాలా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ ని టీమ్ అంతా ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. "ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేసి 50 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత, 'కారులో ఆత్మ' అనే కాన్సెప్ట్ తో నయనతార 'డోరా' రానున్నట్టు తెలిసింది.

'డోరా' పోస్టర్ చూసిన తరువాత మా కాన్సెప్ట్ కి చాలా దగ్గరగా ఉందనుకుని మరింతగా భయపడిపోయాము. 'డోరా' రిలీజ్ వరకూ మా సినిమా షూటింగును ఆపేశాము. 'డోరా' రిలీజ్ రోజున నేను తొలి ఆటకే వెళ్లి చూశాను. ఆరంభంలో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ తరువాత 'డోరా' కథకి .. మా కథకి అసలు సంబంధమే లేదు. దాంతో తేలికగా ఊపిరి పీల్చుకుని, మళ్లీ షూటింగు మొదలుపెట్టాము" అని చెప్పుకొచ్చాడు.
vijay devarakonda
priyanka

More Telugu News