వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య
మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా రామచంద్రయ్యను వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శితో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒక ప్రకటనలో తెలిపారు.