సునీల్ అసంతృప్తి .. మాట ఇచ్చిన త్రివిక్రమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సునీల్ అసంతృప్తి .. మాట ఇచ్చిన త్రివిక్రమ్

  • కమెడియన్ పాత్రలపై సునీల్ దృష్టి 
  • కలిసిరాని రెండు సినిమాలు 
  • త్రివిక్రమ్ తదుపరి సినిమాలో ఛాన్స్
హీరోగా విజయాలు ముఖం చాటేయడంతో, ఇక కమెడియన్ గా కూడా ఇతర సినిమాల్లో చేయాలనే నిర్ణయానికి సునీల్ వచ్చేశాడు. దాంతో కమెడియన్ గా సునీల్ కి మళ్లీ లిఫ్ట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ 'అరవింద సమేత'లో ఆయనను తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో సునీల్ కి సంబంధించిన ఎక్కువ సీన్స్ ను చివరి నిమిషంలో లేపేయడం వలన, ఆయన పాత్రకి రావలసినంత గుర్తింపు రాలేదు.

ఇక 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో సునీల్ మంచి రోల్ చేసినా, ఆ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో సునీల్ పాత్రను గుర్తుపెట్టుకున్నవారు లేరు. కమెడియన్ గా తన రీ ఎంట్రీ పట్ల సునీల్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, తన తదుపరి సినిమాలో మంచి రోల్ క్రియేట్ చేస్తానని త్రివిక్రమ్ మాట ఇచ్చాడట. త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో వుండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ సినిమాలో కామెడీకి ప్రాధాన్యత ఉంటుంది కనుక, సునీల్ కి మంచి పాత్ర పడుతుందనే భావించవచ్చు.   
trivikram
sunil

More Telugu News