9 మంది చిన్నారులపై అత్యాచారం, హత్యచేసిన మానవమృగం పట్టివేత
- చిన్నారుల కాళ్లు, తలను ఛిద్రం చేశాక అత్యాచారం
- అతడు చెప్పిన విషయాలు విని షాక్కు గురైన పోలీసులు
- ఎట్టకేలకు సంకెళ్లు
మొత్తం 9 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు వెల్లడించాడు. పనీపాటా లేని సునీల్ ఒంటరిగా కనిపించే బాలికలకు తినుబండారాల ఆశ చూపించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. ఆపై వారి కాళ్లు, తలను ఛిద్రం చేసేవాడు. వారు బాధతో విలవిల్లాడుతుంటే అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ నెల 11న మూడేళ్ల బాలికను తీసుకెళ్తుండగా ఓ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.