‘పతంజలి’కి తగ్గిన ఆదరణ.. పడిపోయిన అమ్మకాలు
- ప్రాభవం కోల్పోతున్న పతంజలి
- దారుణంగా పడిపోతున్న అమ్మకాలు
- ఐదేళ్లలో ఇదే తొలిసారి
ఐదేళ్లలో తొలిసారి పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్నారు. పతంజలికి సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంతోపాటు జీఎస్టీ దెబ్బతీసిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి పతంజలి ఆదాయం పదిశాతం తగ్గి రూ. 8,148కోట్లకు పరిమితమైనట్టు తెలిపింది. 2013 తర్వాత ఇంత భారీ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారని పేర్కొంది. జీఎస్టీ, సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ అభిప్రాయపడింది.