దుబాయ్ షోలో డ్యాన్స్ చేసేందుకు బాలీవుడ్ భామకు భారీ మొత్తం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ షోలో డ్యాన్స్ చేసేందుకు బాలీవుడ్ భామకు భారీ మొత్తం?

  • దుబాయ్ లో టీ10 క్రికెట్ లీగ్
  • ప్రారంభోత్సవ షోలో సందడి చేయనున్న ఊర్వశి
  • ఈ షోలో డ్యాన్స్ చేయనున్న ముద్దుగుమ్మ
2013 లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెలా. ప్రత్యేక గీతాల్లోనే కాకుండా పాప్యులర్ మ్యూజిక్ వీడియోల్లోనూ నటించే ఊర్వశి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, దుబాయ్ లో టీ10 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించే ఓ షోలో ఆమె సందడి చేయనుందట. ఈ షోలో ఆమె డ్యాన్స్ చేసేందుకు నిర్వాహకులు భారీ మొత్తంలో ముట్టజెప్పారట. ఈ ప్రదర్శనకు గాను సుమారు రూ.80 లక్షలు ఊర్శశి తీసుకుందని తెలుస్తోంది. ఒక్క షోకు ఇంత భారీ మొత్తాన్ని ఊర్వశి తీసుకుందన్న వార్త నిజమో, అబద్ధమో కానీ, బాలీవుడ్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ఇక, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చెప్పాలంటే.. దుబాయ్ పార్క్ అండ్ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతుందట. ఊర్వశితో పాటు ప్రముఖ గాయకుడు ఆతిఫ్ అస్లామ్, నటి మహీరా ఖాన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ప్రత్యేక షో టికెట్ ఖరీదు రెండు వేల రూపాయలని సమాచారం.
Bollywood
dubai
t10 cricket league
urvasi rowtela

More Telugu News