TRS: ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ను వీడను: ఎంపీ సీతారాంనాయక్

  • సీఎం కేసీఆర్ పై నాకు నమ్మకం ఉంది
  • ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో ఉన్నా
  • నాకు పార్టీలు మారాల్సిన అవసరం లేదు
టీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నిన్న గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన మరో ఎంపీ సీతారామ్ నాయక్ కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారన్న వదంతుల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందని, ఎట్టిపరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ ను వీడనని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్నానని, తనకు రాజకీయ భవిష్యత్ నిచ్చి, ఎంపీగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్ ను ఎన్నడూ విడవనని అన్నారు. తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, ఈ ఎన్నికల్లో తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో టీఆర్ఎస్ విజయానికి పాటుపడతానని అన్నారు. తాను పార్టీ మారతానంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇలాంటి నీతిమాలిన రాజకీయాలను చేయడం మానుకోవాలని సీతారాం నాయక్ హితవు పలికారు. 
TRS
mp sitaram nayak

More Telugu News