మద్యం మత్తులో సిగరెట్ అంటించుకున్న మహిళ... సజీవదహనమైంది!
- దుప్పటికి అంటుకున్న సిగరెట్ నిప్పు
- మత్తులోనే కాలి బూడిదైన కల్పన
- కేసు విచారిస్తున్న పోలీసులు
ప్రొఫెసర్ ఇంట్లో లేని సమయంలో మందుకొట్టిన ఆమె, సిగరెట్ అంటించుకుని నిద్రపోయింది. ఆ నిప్పు తొలుత దుప్పటికి, ఆపై మంచానికి అంటుకుంది. మద్యం మత్తులో పడివున్న ఆమెకు మంటలంటుకున్న విషయం కూడా తెలియలేదు. కల్పన నిద్రిస్తున్న గదిలో నుంచి పొగలు వస్తుండటంతో, గమనించిన ఇంటి యజమాని, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికే ఆమె సజీవ దహనమై కనిపించింది. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.