Telangana: టీఆర్ఎస్ నమ్మించి గొంతు కోసింది.. కంటతడి పెట్టిన నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు!

  • వరంగల్(తూర్పు) టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
  • పార్టీ కోసం కష్టపడితే అన్యాయం చేశారు
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం తనను నమ్మించి గొంతు కోసిందని వరంగల్ (ఈస్ట్) నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్(తూర్పు) నియోజకవర్గంలో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరి క్షణంలో మోసం చేశారని వాపోయారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు పాటుపడితే చివరికి తనకు అన్యాయం జరిగిందని చెప్పారు. వరంగల్ లో టీఆర్ఎస్ నేతలు, అనుచరులతో ప్రదీప్ రావు సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా పార్టీకి నిరంతరం సేవ చేసినా తనకు గుర్తింపు దక్కలేదని ప్రదీప్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. వరంగల్ (తూర్పు) ప్రజలు తనవైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Telangana
Warangal east
cry
yerrabelli pradeeprao

More Telugu News