Tirumala: శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో విక్టరీ వెంకటేష్!

  • గత రాత్రి తిరుమలకు వచ్చిన వెంకటేశ్
  • ఈ వేకువజామున స్వామి సేవలో
  • వీఐపీ దర్శన సమయంలో వచ్చిన డీజీపీ ఠాకూర్
గత రాత్రి తిరుమలకు వచ్చిన టాలీవుడ్ హీరో వెంకటేశ్, ఈ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్ కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్వామి దర్శనం చేయించి, ఆపై తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా, వెంకటేశ్ ఆలయం వెలుపలికి వచ్చిన తరువాత, పలువురు భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

ఇదిలావుండగా, ఇదే సమయంలో ఏపీ డీజీపీ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి ఆయన రాగా, అధికారులు దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి, స్వామి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందించారు.
Tirumala
Venkatesh
RP Thakur

More Telugu News