పంజాబ్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారి ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
- అమృతసర్ శివార్లలో ఉగ్రదాడి
- గ్రనేడ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులు
- ఆపై పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
- సమాచారం ఇస్తే భారీ రివార్డు ప్రకటించిన పంజాబ్ సీఎం
నిన్న అమృతసర్ శివార్లలోని నిరంకారీ భవన్ ను టార్గెట్ చేసుకుని వీరు దాడికి పాల్పడగా, ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఖలిస్థాన్, కశ్మీరీ ముఠాల పని కావచ్చని అభిప్రాయపడ్డ అమరీందర్, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
కాగా, సీసీటీవీ ఫుటేజ్ వివరాల ప్రకారం, వీరిలో ఒకరు జీన్స్, షర్ట్ ధరించగా, మరొకడు కుర్తా పైజమా వేసుకుని ఉన్నాడు. వీరిద్దరి ముఖాలకూ మాస్క్ లు ఉండటంతో వీరెవరన్నది స్పష్టంగా తెలియడం లేదు.