secunderabad: సికింద్రాబాద్ టీఆర్ఎస్ లో కలకలం.. రెబెల్ గా బరిలోకి దిగుతున్న నగేశ్

  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రెబెల్ గా బరిలోకి దిగుతున్న గజ్జెల నగేశ్
  • గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి
  • గెలిచి.. కంటోన్మెంట్ స్థానాన్ని కేసీఆర్ కు బహూకరిస్తానన్న నగేశ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలకు రెబెల్స్ షాక్ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓడిపోయిన గజ్జెల నగేశ్ కు ఈ సారి ఆ పార్టీ టికెట్ దక్కలేదు. టీఆర్ఎస్ లో చేరిన సాయన్న టికెట్ ఎగరేసుకుపోయారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన నగేశ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. కంటోన్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని... ఎన్నికల్లో గెలిచి, కంటోన్మెంట్ స్థానాన్ని కేసీఆర్ కు బహూకరిస్తానని ఆయన తెలిపారు. 
secunderabad
contonment
TRS
rebel
gajjela nagesh

More Telugu News