Ramcharan: చెర్రీకి 'ఆల్ ది బెస్ట్' చెప్పిన ఉపాసన!

  • నేడు ప్రారంభమైన కొత్త చిత్రం షూటింగ్
  • ట్విట్టర్ లో అభినందనలు తెలిపిన ఉపాసన
  • వైరల్ అవుతున్న ట్వీట్
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తనకు సంబంధించిన అన్ని విషయాలనూ అభిమానులతో పంచుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన, తాజాగా భర్తకు 'ఆల్ ది బెస్ట్' చెప్పింది. తన భర్త, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ 'RRR' షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కాగా, చెర్రీ అయ్యప్ప మాల ధారణలో ఉన్న ఫోటోను పెడుతూ, ఉపాసన శుభాకాంక్షలు చెప్పింది.

"నా ప్రియమైన మిస్టర్ సీ... తొలి రోజు 'RRR' షూటింగ్ సందర్భంగా నీకు శుభాకాంక్షలు" అని కామెంట్ పెట్టింది. కాగా, సినిమా షూటింగ్ ప్రారంభమైందని ఈ ఉదయం రాజమౌళి కూడా ఓ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అటు నందమూరి అభిమానుల్లో, ఇటు మెగా అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.



Ramcharan
RRR
Rajamouli
NTR
Upasana
Twitter

More Telugu News