West Godavari District: పూజలు చేస్తుండగా అర్చకుడికి గుండెపోటు... ఆలయంలోనే మృతి!

  • పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘటన
  • కార్తీక సోమవారం పూజల్లో ఉండగా కుప్పకూలిన ఉప ప్రధాన అర్చకుడు
  • ఆలయంలోనే చనిపోవడంతో దర్శనాలు నిలిపివేత
కార్తీక సోమవారం ఏకాదశిని పురస్కరించుకుని మహా శివునికి పూజలు చేస్తున్న ఓ అర్చకుడు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ప్రముఖ పంచారామ క్షేత్రం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కోట నాగ వెంకట వరప్రసాద్‌ (54) ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన స్వామి పూజల్లో పాల్గొన్నారు. కార్యకమ్రం నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆయన చనిపోయారని నిర్థారణకు వచ్చాక ఆలయంలో దర్శనాలు, పూజలు నిలిపివేశారు.
West Godavari District
palakollu
preist died

More Telugu News