కొత్తగూడెంలో భూమిలో రూ. 40 కోట్లు పాతిపెట్టారంటూ ఫోన్ కాల్.. పోలీసుల ఉరుకులు, పరుగులు!
- టీఆర్ఎస్ కార్యకర్త పాతిపెట్టాడు
- తాను చూశానంటూ పోలీసులకు ఫోన్
- ఎంత తవ్వినా బయటపడని చిల్లిగవ్వ
- ఫేక్ కాల్ అని తేల్చిన పోలీసులు
దీంతో పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి ఐటీ అధికారులతో సహా వెళ్లి, ఎక్స్ కవేటర్ ను తెచ్చి మరీ తవ్వకాలు జరిపించారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా తెలియడంతో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎంత తవ్వినా చిల్లిగవ్వ కూడా బయటపడక పోవడం గమనార్హం. ఇది పోలీసులను తప్పుదారి పట్టించేందుకు చేసిన ఫేక్ కాల్ అని అధికారులు తెలిపారు. ఈ కాల్ ఎవరు చేశారన్న విషయమై విచారిస్తున్నట్టు తెలిపారు.