ప్లేసు.. టైము మీరే చెప్పండి.. దమ్ముంటే 15 నిమిషాలు నాతో చర్చకు రండి.. మోదీకి సవాలు విసిరిన రాహుల్ గాంధీ
- నేను అడిగే ప్రశ్నలకు మోదీ వద్ద సమాధానం లేదు
- దమ్ముంటే నాతో చర్చకు రమ్మనండి
- నోట్ల రద్దుతో లాభపడింది ఆయన వ్యాపార స్నేహితులే
‘‘రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా ఓ 15 నిమిషాలు నాతో చర్చకు రావాల్సిందిగా మోదీని సవాలు చేస్తున్నా. అనిల్ అంబానీ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనలు, యుద్ధ విమానాల ధర గురించి మాట్లాడతా. ఈ మొత్తం కథంతా ప్రధానే నడిపించారని రక్షణ మంత్రి చెప్పిన విషయం గురించి మాట్లాడతా. నియమ నిబంధనలను ప్రధాని పాటించలేదు. సీబీఐ డైరెక్టర్‌ను అర్ధరాత్రి దాటాక ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్నలన్నింటికీ మోదీ వద్ద సమాధానం లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో మోదీ ‘బిజినెస్మెన్ ఫ్రెండ్స్’ లాభపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు.