హైదరాబాద్‌లోని పలు కంపెనీలపై ఐటీ అధికారుల దాడులు.. మళ్లీ కలకలం!

  • ఉదయం నుంచే రంగంలోకి దిగిన అధికారులు
  • రవిఫుడ్స్‌, శాంతా శ్రీరామ్‌ కనస్ట్రక్షన్స్‌పై దృష్టి
  • డీఎస్‌ఏ బిల్డర్స్‌ కార్యాలయాల్లోనూ తనిఖీలు
హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు నగరంలోని పలు ప్రముఖ కంపెనీలపై దృష్టిసారించారు. రవి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శాంతా శ్రీరామ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే టీడీపీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ ముగ్గురు కొడుకులు ప్రమోటర్స్‌గా ఉన్నారని భావిస్తున్న డీఎస్‌ఏ బిల్డర్స్‌ కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేవేందర్‌ తనయులు ఈ కంపెనీల్లో డైరెక్టర్‌లుగా లేరని సమాచారం. కాగా, రవిఫుడ్స్‌ డైరెక్టర్లు రవీందర్‌కుమార్‌ అగర్వాల్‌, రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌, కేదార్నాథ్‌ అగర్వాల్‌ ఇళ్లపై ఏకకాలంలో అధికారులు దాడులు చేయడం గమనార్హం.
Go Back to Shorts
Hyderabad
IT raides

More Telugu News