వెంటాడిన పోకిరీలను ధైర్యంగా పట్టించిన కాలేజీ అమ్మాయి!
- ముంబై, అంధేరీ ప్రాంతంలో ఘటన
- కాలేజీ నుంచి వెళుతుంటే వెంటాడి వేధింపులు
- డైరెక్టుగా స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు
వారి ఆట కట్టించాలని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి, పోకిరీలు ప్రయాణిస్తున్న కారు నంబరును నోట్ చేసుకుని, అదే ఆటోలో జుహూ పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కారును వెంబడించి వారిని అరెస్ట్ చేశారు. వీరు విజయ్ రాణ్, వికాస్, స్ట్రాహాన్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయిని అధికారులు అభినందించారు.