నువ్వు లేవనే బాధ మనసును తొలిచేస్తున్నా.. నవ్వుతూనే ఉంటా!: విమాన ప్రమాదంలో మరణించిన ప్రియుడి కోసం పోస్ట్
- పెళ్లి కోసం వేరే ప్రాంతానికి వెళుతూ నంద ప్రతామా మృతి
- ఫోటోలు దిగి పంపించాలని కాబోయే భార్యకు సూచన
- పెళ్లి కూతురిలా తయారై ఫోటోలు దిగిన ఇంతన్ స్యారీ
దీనికి ముందు తనకు కాబోయే భార్య ఇంతన్ స్యారీకి ఫోన్ చేసి తాను అనుకున్న సమయానికి రాలేకపోతే.. ఫోటోలు దిగి తనకు పంపించాలని కోరాడు. ఇంతలోనే విమాన ప్రమాదంలో నంద కన్నుమూశాడు. అయితే అతని కోరిక నెరవేర్చాలనుకున్న ఇంతన్ పెళ్లి కూతురిలా తయారై ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేసింది. ‘నువ్వులేవనే బాధ మనసును తొలిచేస్తున్నా.. నీకోసం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నువ్వు చెప్పినట్లుగానే దృఢంగా ఉంటాను’ అంటూ హృదయం బరువెక్కే పోస్టు పెట్టింది.