Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ్యోతిక ప్రధాన పాత్రధారిగా కొత్త సినిమా ప్రారంభం

  • డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నుంచి మరో మూవీ
  • ఈ రోజు ఉదయమే జరిగిన పూజా కార్యక్రమాలు
  • ఈ వీకెండ్ నుంచి రెగ్యులర్ షూటింగ్
తెలుగు ... తమిళ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా జ్యోతికకి మంచి క్రేజ్ వుంది. రీ ఎంట్రీ తరువాత ఆమె చాలా విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఈ రోజు ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ఈ పూజా కార్యక్రమాలకు సూర్య కూడా హాజరయ్యారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, ఎస్.రాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ వీకెండ్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కూడా తనకి మంచి పేరు తీసుకొస్తుందని జ్యోతిక భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.     
jyothika

More Telugu News