రాహుల్ గాంధీకి ఫిర్యాదుల వెల్లువ... సీరియస్!
- తొలి జాబితా తరువాత వెల్లువెత్తిన అసంతృప్తి
- ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం
- మరోసారి పరిశీలించాలని రాహుల్ ఆదేశం
సీట్లన్నీ తమతమ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాతినిధ్యం లభించిందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన 'పారాచూట్' నేతలకు ఎక్కువ సీట్లిచ్చారని రాహుల్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఆయన, ఈ జాబితాను పునఃసమీక్షించాలని స్క్రీనింగ్ కమిటీకి ఈ ఉదయం ఆదేశాలు ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా తుది జాబితాను సిద్ధం చేయాలని కూడా ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.