కాలిఫోర్నియా కార్చిచ్చు.. హృదయ విదారకంగా పరిస్థితి.. పలువురు సజీవ దహనం!
- కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
- హాలీవుడ్ నటులుండే ప్రాంతానికీ మంటల విస్తరణ
- త్రుటిలో తప్పించుకున్న నటుడు గెరార్డ్ బట్లర్
- ఇప్పటి వరకు 48 మంది సజీవ దహనం
సహాయక సిబ్బంది ఇప్పటి వరకు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా పైనుంచి నీటిని చల్లి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఏకంగా 9 వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు అహరహం శ్రమిస్తున్నారు. తాజాగా, హాలీవుట్ నటులు నివసించే మాలీబు ప్రాంతానికి కూడా మంటలు విస్తరించాయి. చాలామంది నటీనటుల ఇళ్లు కాలిబూడిదైనట్టు సమాచారం. హాలీవుడ్ ప్రముఖ నటుడు గెరార్డ్ బట్లర్ ఇల్లు మంటలకు ఆహుతైంది. అదృష్టవశాత్తు అతడు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.