Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఫ్రెష్ ఎయిర్... ఫ్రెష్ ఎయిర్'... గాలిని కూడా అమ్మేస్తున్నారు!

  • న్యూఢిల్లీలో తాజా గాలి వ్యాపారం
  • ఆన్ లైన్ లోనూ లభిస్తున్న ఫ్రెష్ ఎయిర్
  • రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా సంస్థ
"ఫ్రెష్ ఎయిరో... ఫ్రెష్ ఎయిర్...ఇంట్లోనే ఉండండి. స్వచ్ఛమైన కొండగాలిని పీల్చండి. 7.5 లీటర్ల గాలి 1499 రూపాయలు మాత్రమే"... లీటర్ బాటిల్ గాలి కావాలన్నా ఇస్తాం. 160 సార్లు పీల్చుకోవచ్చు... కాలుష్యం పెరిగిపోయిన న్యూఢిల్లీలో పలు కంపెనీలు, 'స్వచ్ఛమైన గాలి' అంటూ వ్యాపారాన్ని మొదలు పెట్టాయి. ఫ్రెష్ ఎయిర్ అమ్మకాలు ఆన్ లైన్ మాధ్యమంగానూ సాగుతున్నాయి.

 ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ 7.5 లీటర్ల గాలిని రూ. 1,499కి విక్రయిస్తుండగా, హిమాలయాల నుంచి తెచ్చిన గాలి... అంటూ ఉత్తరాఖండ్ కు చెందిన ఓ కంపెనీ 160 సార్లు పీల్చుకునే గాలిని రూ. 550కి అమ్ముతోంది. ఈ గాలిని కొనుగోలు చేస్తే, బాటిల్ తో పాటు, ఓ మాస్క్ మాదిరిగా ఉండే పంపు కూడా లభిస్తుంది. దీన్ని ముఖానికి అమర్చుకుని బటన్ పుష్ చేస్తే, స్ప్రే మాదిరిగా తాజా గాలి, ముక్కుకు అందుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ఈ గాలి వ్యాపారం చాలా జోరుగా సాగుతోంది. అదండీ సంగతి!
New Delhi
Pollution
Fresh Air
Sales
Online

More Telugu News