మెట్టు దిగివచ్చారు... మూడు స్థానాలతో సరిపెట్టుకున్న సీపీఐ!
- నిన్నటి వరకూ 5 స్థానాలు కావాలని సీపీఐ పట్టు
- మూడు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఓకే
- హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి సీపీఐకి
తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో మహాకూటమి ఏర్పడగా, కాంగ్రెస్ నిన్న రాత్రి 65 మందితో తొలి జాబితాను ప్రకటించగానే, టీడీపీ 9 మందితో జాబితా విడుదల చేసింది. ఇక సీపీఐకి హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి విజయ పేర్లు ఖరారు కాగా, బెల్లంపల్లి నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్న విషయమై ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఈ విషయంలో నేటి సాయంత్రానికి ఓ స్పష్టత రానుండగా, ఆపై సీపీఐ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.