ఎన్నికల ఎఫెక్ట్?... నేడూ తగ్గిన పెట్రోలు ధర!
- లీటరు పెట్రోలుపై 13 పైసల తగ్గింపు
- 12 పైసలు తగ్గిన డీజిల్ ధర
- క్రూడాయిల్ ధర పెరిగినా కనిపించని ప్రభావం
ఆమధ్య కర్ణాటక ఎన్నికల సమయంలో మూడు వారాల పాటు పెట్రోలు, డీజిల్ ధరలు మారకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి వెళ్లాయి. ఆపై అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారంలో చమురు ఉత్పత్తిని 10 లక్షల బ్యారళ్లు కుదిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించగా, ఆ వెంటనే క్రూడాయిల్ పై ఒత్తిడి పెరిగి, ధరలు తిరిగి పెరగడం ప్రారంభమైంది. ఇండియాపై మాత్రం ఆ ప్రభావం ఇంకా కనిపించడం లేదు.