అమెరికాలో చికిత్స పొందినా లాభం లేకపోయింది... అనంత్ కుమార్ ప్రాణం తీసిన కేన్సర్!
- న్యూయార్క్ లోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స
- గత నెలలోనే తిరిగొచ్చిన అనంత్ కుమార్
- పరిస్థితి విషమించి కన్నుమూత
- సంతాపం తెలిపిన నరసింహన్, కుమారస్వామి
కేన్సర్ విషమించి ఈ తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మరణించగా, ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని బెంగళూరు నేషనల్ కాలేజీలో ఉంచనున్నారు. మొత్తం ఆరుసార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన సంతాపాన్ని వెలిబుచ్చారు. అనంత్ కుమార్ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.