తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం

  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం
  • తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్న కేసీఆర్
  • ఓటరు కార్డు, కేసుల వివరాలతో చేరుకున్న అభ్యర్థులు  
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. తమ 107 మంది అభ్యర్థులకు పార్టీ తరపున బీ-ఫారాలను అందజేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

ఓటరు కార్డు, కేసుల వివరాలతో తెలంగాణ భవన్ కు అభ్యర్థులు చేరుకున్నారు. ఆయా అభ్యర్థులతో పాటు వారి అనుచరులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో, తెలంగాణ భవన్ కిక్కిరిసి పోయింది. అంతకుముందు, తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
 
Go Back to Shorts
telangana bhavan
Hyderabad
kcr

More Telugu News