bjp: ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు మా రథ చక్రాల కింద నలిగిపోతాయి: బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ

  • డిసెంబర్ 5,6,7 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్ర
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునురుద్ధరణే లక్ష్యం
  • అడ్డుకోవాలని ఎవరైనా యత్నిస్తే సహించం
తమ రథయాత్రను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు తెగి తమ రథ చక్రాల కింద నలిగిపోతాయని పశ్చిమబెంగాల్ బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు లాకెట్ ఛటర్జీ హెచ్చరించారు. డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునురుద్ధరణే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని, ఈ యాత్రను అడ్డుకోవాలని ఎవరైనా యత్నిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థా ఛటర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. కాగా, వచ్చే నెలలో బీజేపీ రథయాత్రను అమిత్ షా ప్రారంభించనున్నారు. 7వ తేదీన కోల్ కతాలో నిర్వహించే భారీ ర్యాలీకి ప్రధాని మోదీ హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
bjp
West Bengal

More Telugu News