TRS: 'తమ్ముడూ...' అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆలింగనం చేసుకున్న మోహన్ బాబు!

  • ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో పూజలు
  • ఆలయ సిబ్బందికి వస్త్రాల పంపిణీ
  • టీఆర్ఎస్ కు మరోసారి పట్టం
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానాన్ని ప్రముఖ సినీనటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బందికి  వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును.. 'తమ్మూడూ' అంటూ అప్యాయంగా పలకరించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కితాబిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు మరోసారి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకుల తరపున స్వరూపానందేంద్ర స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకమంలో ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.
TRS
Telangana
Andhra Pradesh
mohan babu
actor
Visakhapatnam District
tummala

More Telugu News