చంద్రబాబు ఓ ఊసరవెల్లి.. అధికారం కోసం రంగులు మారుస్తారు!: తమిళనాడు సీఎం పళనిస్వామి
- కమల్ రాజకీయాలకు సరిపోడు
- నిత్యం ప్రజలతో మమేకమవుతున్నా
- తమిళనాడు సీఎం పళనిస్వామి వ్యాఖ్యలు
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చాలా ధైర్యం, ఓపిక కావాలని పళనిస్వామి వ్యాఖ్యానించారు. విశ్వరూపం-1 సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు తలెత్తితే కమల్ విదేశాలకు పారిపోవడానికి సిద్ధపడ్డారనీ, అలాంటి కమల్ కు రాజకీయాల్లో నిలబడే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. లగ్జరీ జీవితాలు గడిపే నేతలు ప్రజా సమస్యలను పరిష్కరించలేరని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు పళనిస్వామి చెప్పుకొచ్చారు.