Chandrababu: ఫరూక్... సమయం చాలా తక్కువగా ఉంది, జాగ్రత్త!: కాబోయే మంత్రితో చంద్రబాబు

  • నేడు ఏపీ మంత్రివర్గ విస్తరణ
  • క్యాబినెట్ లోకి ఫరూక్, శ్రవణ్
  • ముస్లింలకు మేలు చేయాలని ఫరూక్ కు సూచించిన చంద్రబాబు
నేడు ఏపీ మంత్రివర్గ విస్తరణలో జరుగనుండగా, ఇప్పటివరకూ మంత్రుల్లో స్థానం లేని ముస్లింలకు అవకాశం ఇవ్వాలని భావించిన చంద్రబాబు, ఫరూక్ కు ఆ చాన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫరూక్ తో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు, మంత్రిగా పనిచేసేందుకు సమయం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రాష్ట్రంలోని ముస్లింలకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయాలని సూచించారు.

ఉన్న కాస్తంత సమయాన్నే మంచిగా వాడుకోవాలని, మైనారిటీలకు ప్రభుత్వాన్ని మరింతగా దగ్గర చేయాలని, సంక్షేమ పథకాల అమలు తీరును వారికి వివరించాలని కోరారు. ఆయనకు మైనారిటీ, వైద్య ఆరోగ్య శాఖలను ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. కాగా, నేడు ఫరూక్ తో పాటు, శ్రవణ్ కూడా మంత్రివర్గంలో చేరనున్న సంగతి తెలిసిందే.
Chandrababu
Cabinet
Andhra Pradesh
Farook

More Telugu News