Prakash Raj: బాగుంది ప్రధాని గారూ.. మీ తీరు!: విరుచుకుపడిన నటుడు ప్రకాశ్ రాజ్

  • ప్రధానిపై మళ్లీ గళమెత్తిన ప్రకాశ్ రాజ్
  • వరదలతో అల్లాడిన కేరళకు రూ.600 కోట్లు
  • పటేల్ విగ్రహానికి వేల కోట్లా?
గత కొంతకాలంగా రాజకీయ పరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా మరోమారు ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వరదలొచ్చి కేరళ ప్రజలు అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండీ, గుడ్డ లేకుండా ప్రజలు నానా కష్టాలు పడ్డారని, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు.

అంతటి విపత్తు జరిగితే కేరళను ఆదుకోవాల్సిన ప్రధాని తొలుత వంద కోట్ల రూపాయల సాయం ప్రకటించారని, విమర్శలు రావడంతో ఆ తర్వాత మరో 500 కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు.  కానీ సర్దార్ పటేల్ విగ్రహానికి మాత్రం వేల కోట్ల రూపాయలను నీళ్లలా ధారపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీని దుమ్మెత్తి పోశారు. విగ్రహానికి ఇచ్చిన విలువ మనుషులకు లేకుండా పోయిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
Prakash Raj
Narendra Modi
BJP
Kerala
STATUE
Floods

More Telugu News