వరుసగా రెండో శుక్రవారం సీబీఐ కోర్టుకు జగన్ దూరం!
- అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నారని తెలిపిన జగన్ లాయర్
- శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత
- డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో ఇంటికే పరిమితం
గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో అక్కడి రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ పై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. గాయానికి చికిత్స చేస్తున్న వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో విపక్ష నేత రెండు వారాలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ కారణంగా గత శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కాలేదు.