komatireddy: నకిరేకల్‌ టికెట్‌ వేరొకరికి ఇస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. నకిరేకల్‌ టికెట్‌ చిరుమర్తి లింగయ్యకు కాకుండా వేరెవరికైనా ఇస్తే నల్గొండలో పోటీ నుంచి తాను తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్‌ చేశారు. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి విచ్చేసిన కోమటిరెడ్డిని ఈరోజు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్‌ టికెట్‌ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యకర్తల డిమాండ్‌పై కోమటిరెడ్డి స్పందిస్తూ ఈ విధంగా తేల్చిచెప్పారు.
Go Back to Shorts
komatireddy
nakirekal ticket

More Telugu News